Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘం భవనానికి భూమి పూజ

మహిళా సంఘం భవనానికి భూమి పూజ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో నూతన మహిళా సంఘం భవనానికి భూమి పూజ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి కోసం మహిళా సంఘం భవనాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రాజా బాబు గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, గ్రామ సర్పంచ్ శ్రీవాణి వాసు యాదవ్, ఉప సర్పంచ్ ప్రకాష్, భిక్కనూర్ పట్టణ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, అంకం రాజు, మహిళా సంఘం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -