Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సామ్రాజ్యవాద అమెరికా–ఇజ్రాయిల్ ల యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండించాలి 

సామ్రాజ్యవాద అమెరికా–ఇజ్రాయిల్ ల యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండించాలి 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
సామ్రాజ్యవాద అమెరికా, ఇజ్రాయిల్ మతోన్మాదాన్ని తీవ్రంగా ఖండించాలని విరసం పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బాసాని రాజయ్య మంగళవారం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయల్ యుద్దాన్ని నిరసిస్తూ కార్యక్రమాంని మిర్వహచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం, ఏఐఏప్ టియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి.రత్నకుమార్, సిపిఐఐ జిల్లా కార్యదర్శి తాంద్ర సదానందం, డిఎల్పీ రాష్ట్ర కార్యదర్శి మార్వడి సుదర్శన్ మాట్లాడుతూ.. పచ్చిమ ఆసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ నిరపరాధ ప్రజలపై దాడులు జరిపే అమెరికా–ఇజ్రాయిల్ కూటమి చర్యలు మానవత్వానికి విఘాతం అన్నారు. ఈ యుద్ధాలు సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం మాత్రమే నడపబడుతున్నాయన్నారు.

ప్రపంచ ప్రజల శాంతి, భద్రతలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని విమర్శించారు.ఇతర రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ .. అమెరికా రాజకీయాలు ఎప్పుడూ చిన్న  దేశాలను తన గుప్పెటలో పెట్టుకోవాలనే దుష్ట లక్ష్యంతోనే ఉంటాయనీ, ఆ దేశాల్లో సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలు కొల్లగొట్టేందుకే వెనిజులా అధ్యక్షుడు మదురోను అక్రమంగా దాడిచేసి ఎత్తుకెళ్లడం, మళ్ళీ ఇరాన్ దేశంపై ఇజ్రాయిల్ లతో కలిసి ఆ దేశ నేతను హతమార్చి ఆ దేశాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం, ఇతర దేశాలపై చేస్తున్న దాడులకు కారణమని తెలిపారు.

అమెరికా తన మాట వినని దేశాల పక్కలో బల్లెం లా తన సైనిక  స్థావరాలను ఏర్పాటు చేసి ఆయా దేశాలను బెదిరిస్తుందనీ, దానిలో భాగంగా ఇజ్రాయిల్‌ను ఏర్పాటు చేసి గల్ఫ్ దేశాల్లో రౌడీలా వ్యవహరిస్తుందన్నారని తెలిపారు. ఈ దాడులు ప్రపంచ శాంతికి తీవ్రమైన ముప్పుగా మారాయి. వేలాది నిరపరాధ ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా, లక్షలాది మంది నిరాశ్రయులుగా మారుతున్నారన్నారు. పిల్లలు, మహిళలు, సాధారణ పౌరులు ఈ యుద్ధాలకు బలి పశువులుగా మారడం మానవత్వానికి అవమానమన్నారు. ఈ పరిస్థితి కొనసాగుతుండటం ప్రపంచ ప్రజాస్వామ్య విలువలకు సవాలు విసురుతోందన్నారు.

ఇదే సమయంలో భారతదేశంలో మోదీ ప్రభుత్వం సామ్రాజ్యవాద శక్తులకు మద్దతు ఇచ్చే విధంగా విధానాలు అమలు చేయడం అత్యంత ఆందోళనకరం. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాల్సిన భారతదేశం, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం దేశ సార్వభౌమాధికారాన్ని బలహీనపరుస్తోంది. ఇది  భారత దేశ ప్రజల ప్రయోజనాలకు పూర్తిగా వ్యతిరేకం. మోడీ ప్రభుత్వ విధానాలు కేవలం విదేశాంగ విధానం కాదు, దేశీయంగా కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయి.

ఈ విధానాలు దేశ ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిని దెబ్బతీస్తూ అసమానతలను పెంచుతున్నాయి. భారతదేశం తన అవసరాలకు ఎక్కువ శాతం చమురును దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే, దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయి. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి, ఆహార పదార్థాల ధరలు కూడా ఎగసిపడతాయి.

చివరికి ఈ మొత్తం భారాన్ని భరిస్తున్నదన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఏప్ టియు నాయకులు కోరేఫు మల్లేష్, బుద్ధుల రమేష్,(స్త్రీవిముక్తి )నాయకురాలు అరికిళ్ల లలితక్క, సిపిఐ నాయకులు పెర్కా సతీష్, ఏఐఏప్ రాష్ట్ర కార్యదర్శి బాలసాని లెనిన్, కేవీపీస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి తిప్పరపు సురేష్, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిపాక రవీందర్,జిల్లా ఉపాధ్యక్షలు నర్ల గోపాల్ యాదవ్, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు బొంకురి లక్ష్మణ్,రాజు,రాజ గోపాల్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపెల్లి మల్లయ్య. అరుణో దయ నాయకులు తిర్రి బాల కృష్ణ,ట్రాన్స్ జెండర్స్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -