నవతెలంగాణ – మద్నూర్
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణను అత్యంత క్షుణ్ణంగా, ఇంటింటికీ తిరిగి పరిశీలించి, కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన వారిని తొలగించడం, వివరాలను సరిదిద్దడం వంటి పనులను వేగంగా చేయడానికి ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపట్టాలని జిల్లా ట్రైనింగ్ అధికారులు శిక్షణలో తెలిపారు. మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు జుక్కల్ ఎస్సీ (SC) అసెంబ్లీ నియోజకవర్గంలోని తహసీల్దార్, మాస్టర్ ట్రైనర్ లకు మరియు బూత్ లెవెల్ అధికారుల సూపర్ వైజర్లకు, ఆపరేటర్స్ లకు ఎస్ఐఆర్ పై ఒక రోజు శిక్షణా నిర్వహించినట్లు మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ తెలిపారు. ఈ కార్యక్రమం లో తహశీల్దార్లు ప్రవీణ్, వేణు గోపాల్, మహేందర్, మారుతి, భుజంగ రావు, హేమలత, సత్యనారాయణ రవి కాంత్, బి ఎల్ వో లు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్ పై అధికారులకు శిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



