నవతెలంగాణ-హైదరాబాద్: శ్రీనగర్ కాలనీలోని తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి ఆస్తి పన్ను చెల్లించక పోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. మంగళవారం దీనిపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు. మరో నెల రోజుల్లో పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను సెటిల్ చేసుకుంటామని జీహెచ్ఎంపీ అధికారులకు వారు హామీ ఇచ్చారు. దీంతో జయలలిత నివాసానికి వేసిన సీజ్‌ను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు.
రూ. కోటి 59 లక్షల బకాయిలు ఉండటంతో బిల్డింగ్‌ను అధికారులు సీజ్ చేశారు. అందులో రూ. 78 లక్షలు ప్రిన్సిపల్ అమౌంట్ కాగా రూ. 81 లక్షలు వడ్డీగా తేల్చారు. అందులో రాయితీ పోగా మొత్తం రూ.82,91,822 మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జయలలితకు సంబంధించిన ఈ భవనంలో గతంలో ప్రైవేట్ కార్యాలయాన్ని నిర్వహించారు. అయితే 2017 నుంచి ఈ భవనాన్ని నివాసానికి వాడుకుంటున్నామని ఆమె బంధువులు జీహెచ్ఎంసీ అధికారులను గతంలో కోరినట్లు సమాచారం. గత కొంత కాలంగా ఈ భవనం ఖాళీగా ఉంటుంది.



