Thursday, April 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవిజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఆర్టెమిస్ -2

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఆర్టెమిస్ -2

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అర్టెమిస్-2’ మిషన్ ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 1972లో జరిగిన అపోలో-17 మిషన్ తర్వాత, అంటే సుమారు 54 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం, మళ్ళీ మానవులను చంద్రుడి దరిచేర్చే మొదటి ‘క్రూడ్ మిషన్’ ఇదే కావడం విశేషం. నాసాకు చెందిన అత్యంత శక్తివంతమైన Space Launch System రాకెట్ సహాయంతో ఓరియన్ క్యాప్సూల్ వ్యోమగాములను మోసుకెళ్తూ అంతరిక్షంలోకి ప్రవేశించింది. లాంచ్ సక్సెస్ అయినట్లు, వ్యోమగాములు క్షేమంగా ఉన్నట్లు నాసా అధికారికంగా ధృవీకరించింది.

ఈ చారిత్రాత్మక యాత్రలో నలుగురు ధైర్యవంతులైన వ్యోమగాములు భాగస్వాములయ్యారు. కమాండర్ రీడ్ వైస్‌మన్ నేతృత్వంలో పైలట్ విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టినా కోచ్ (నాసా) మరియు కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ ఈ ప్రయాణంలో ఉన్నారు. వీరి ప్రధాన లక్ష్యం చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి, జాబిల్లిని చుట్టి తిరిగి భూమికి చేరుకోవడం. సుమారు 10 రోజుల పాటు సాగే ఈ మిషన్ ద్వారా ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోని లైఫ్ సపోర్ట్, కమ్యూనికేషన్, ఇతర కీలక వ్యవస్థలను అంతరిక్షంలో పరీక్షించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -