నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : జూన్ 4వ తేదీన గొర్రెల మేకల పెంపకందారుల సంఘం 4వ సదస్సును జయప్రదం చేయాలని జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ కోరారు. ఆదివారం భువనగిరి మండలంలోని తాజ్పూర్, అనంతారం, రామచంద్రపురం, పెంచుకల పహాడ్, రామకృష్ణాపురం, చందుపట్ల, వీరవెల్లి గ్రామాలలో కరపత్రాలు ఆవిష్కరించి, మాట్లాడారు. భువనగిరి తాసిల్దార్ కార్యాలయం ముందు జూన్ న4 వ తేదీ అనగా బుధవారం రోజున ఉదయం 11 గంటలకు టీవీఎన్ జీవో భవన్ కార్యాలయంలో జరిగే గొర్రెల మేకల పెంపకం దారుల ధర్నా సదస్సు జయప్రదం చేయాలని, గొర్రెల మేకల పెద్దపందాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సొసైటీ చైర్మన్లు జిఎన్పిఎస్ మండల అధ్యక్షులు దేవినూరి బాలయ్య, జిల్లా కమిటీ సభ్యులు ర్యాకల శ్రీనివాస్, రేఖల నరసింహ, సోమని నగేష్, బిట్టుకూరి మహేష్, గుల్లని సురేష్, జిట్ట నరసింహ, బాల్ద రవి, ఒగ్గు కుమార్, చిన్నాము బాలేశ్వర్, చిన్నం చంద్రమౌళి, దయ్యాల మహేష్, తోటకూర అశోక్, రేగు మహేష్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
జిఎంపిఎస్ సదస్సును జయప్రదం చేయండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



