నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలంలోని జానకం పేట్ గ్రామంలో శుక్రవారం వెంకటేశ్వర స్వామి ఆలయం కాంపౌండ్ వాల్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. భూమి పూజ కార్యక్రమాలు పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూ.5 లక్షల ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధులు, రూ.5 లక్షల ఎంపీ నిధులతో చేపట్టబోయే వెంకటేశ్వర స్వామి ఆలయం కాంపౌండ్ వాల్ పనులకు భూమిపూజ చేసారు. అంతకుముందు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ప్రశాంత్ రెడ్డికి స్వామివారి ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కాంపౌండ్ వాల్ పనులకు భూమిపూజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



