Friday, April 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్న విశ్వకర్మ యోజన పథకం  

లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్న విశ్వకర్మ యోజన పథకం  

- Advertisement -

నవతెలంగాణ- ఆర్మూర్ 
చేతి వృత్తుల వారిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ పథకం అర్హులకు అందడం లేదని అఖిల భారతీయ విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి అన్నారు. పట్టణంలోని శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దీనిపై విశ్వకర్మ సోదరులు చాలా ఆశలు పెట్టుకున్నారని అన్ని స్కీముల మాదిరిగానే ఈ స్కీం కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదని, ఈ స్కీము కోసం పేద విశ్వకర్మలు ఎదురు చూసిన  నిరాశే మిగిలిందని అన్నారు.

ఇందులో భాగంగా టూల్ కిట్టు అందని   వారు  చాలామంది ఉన్నారని, ఒకవేళ  టూల్ కిట్  అందిన చాలామంది బ్యాంకు లోను కోసం వెళ్తే బ్యాంకు అధికారులు స్పందించడం లేదని అన్నారు. లోను ఇవ్వకుండా బ్యాంకర్లు రిజెక్ట్   చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గాని అధికారుల నిర్లక్ష్యం  వలన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ స్కీంకు సంబంధించి అధికారులు టూల్ కిట్..,  బ్యాంకు అధికారులు బ్యాంకు లోను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినాడు.

ఈ కార్యక్రమంలో వేల్పూర్ విశ్వకర్మ మండల అధ్యక్షులు నూనె గంగాధర్ చారి, సుంకం విష్ణు చారి, నారాయణ చారి ,శ్రీరామ్ ప్రశాంత్ చారి, నాగేంద్ర చారి, చరణ్ చారి      తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -