నవతెలంగాణ- రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ జిల్లా పరిషత్ పాఠశాల లో ఆదివారం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మహా మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు నల్ల నవీన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం రెంజల్ మండల కేంద్రంలో వారు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెంజల్ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఆదివారం ఉదయం 9:30 నుంచి 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
ఉచితమేగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరంలో ప్రధానంగా మధుమేహం, గుండె, ఎముకలు, నరాలు, వెన్నెముక, జనరల్ కు సంబంధించిన నిపుణులైన వైద్యులతో వైద్య సేవలను అందిస్తారాని వారన్నారు. రక్తపోటు, ఈసీజీ, షుగర్ పరీక్ష, చేసి మందులను అందజేస్తారని వారన్నారు. ప్రముఖ వైద్యులు రాఘవేంద్ర, కంచ గోపికృష్ణ, వినయ్ ధన్ పాల్, రాంభూపాల్ రెడ్డి తదితరులు రానున్నట్లు వారు తెలిపారు. కరపత్రాలు ఆవిష్కరించిన వారిలో ఫ్రెండ్స్ యూత్ మండల అధ్యక్షులు కాలే వార్ సంజీవ్, సాయి ప్రకాష్, సాయికుమార్, గంగరాజు, సంజయ్, ప్రకాష్ రాజు తదితరులు పాల్గొన్నారు.



