నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని అమీర్ నగర్ గ్రామంలో ఇంద్రాల పెద్దమ్మి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ముఖ్యఅతిథిగా పాల్గొని ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ అమీర్ నగర్ గ్రామంలో 29 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవ్వగా అందులో 24 ఇళ్లు పూర్తి అయ్యే దశలో ఉన్నాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంటిని అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఎంత మందికి ఇల్లు కావాలంటే అంత మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నిరుపేద సొంతింటిని కలిగి ఉండాలనే సదుద్దేశంతో ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేసిన ఇంద్రాల పెద్దమ్మి కుటుంబ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీరాముల మురళి, నాయకులు భూమారెడ్డి, వార్డు సభ్యులు పుప్పాల నర్సయ్య, క్యాతం గంగారెడ్డి, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.



