నవతెలంగాణ – నసురుల్లాబాద్
క్రైస్తవులు అత్యంత పర్వదినంగా చేసుకునే పండుగల్లో గుడ్‌ఫ్రైడే ఒకటి. ఈ పండుగ సందర్భంగా బీర్కూర్ నసురుల్లాబాద్ మండలాల్లో గురువారం ఘనంగా గుడ్ ప్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీర్కూర్ మండల కేంద్రంలో ప్రార్థనలు చేసి ప్రభువును స్మరించుకుంటూ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి గ్రామంలో థామస్ ఫాస్టర్ ఆధ్వర్యంలో గుడ్ ప్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో విశ్వాసులు హాజరై ప్రార్థనలు చేశారు. లోక కల్యాణం కోసం క్రీస్తు చేసిన అంతిమ త్యాగం మనందరికీ స్ఫూర్తినివ్వాలని, పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం ఆగాలని, ప్రజల కష్టాలు తీరాలని థామస్ ఫాస్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



