సిరిసిల్ల తహసిల్దార్ మహేష్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “తెలంగాణ మన ఇసుక వాహనం” పథకం ద్వారా ఇసుక సరఫరాను పారదర్శకంగా, సులభంగా తక్కువ ధరలలో అందుబాటులో ఉంచడం జరుగుతోందనీ సిరిసిల్ల తహసిల్దార్ మహేష్ పేర్కొన్నారు. ఈ విధానంలో, ప్రజలు మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించబడిందనీ, దీనివల్ల అక్రమ రవాణా నివారించబడుతుందనీ ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ధారిత ధరల ప్రకారం సరఫరా చేయడం జరుగుతుందని, నమోదు చేసిన వాహనాల ద్వారా ఇంటి వద్దకు సరఫరా అవుతుందని, ఇసుక అక్రమ రవాణా నియంత్రణ జరుగుతుందని, ప్రజలు ఇసుక బుకింగ్ కోసం https://tsmiv.cgg.gov.in అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఆయన కోరారు. ప్రజలు అధికారిక వెబ్సైట్ ద్వారానే ఇసుకను బుక్ చేసుకోవాలని, అనధికారిక వ్యక్తులు, మధ్యవర్తులను ఆశ్రయించకూడదని, ఎవరైనా అధిక ధరలు వసూలు చేసినా ,అక్రమ రవాణా చేసినట్లు ఎవరైనా గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని తహసిల్దార్ మహేష్ పేర్కొన్నారు.
పారదర్శకంగా తక్కువ ధరల్లో ఇసుక అందుబాటులో ఉంటుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



