నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులు ఉప్లంచవార్ చంద్రకళ (4వ వార్డు మెంబర్)గారి ఇందిరమ్మ ఇల్లు కై భూమి పూజ మరియు ఇంటి నిర్మాణానికి గ్రామ సర్పంచ్ కర్రెవార్ సావిత్ర మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయా గౌడ్ ముగ్గు వేసి పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ సావిత్ర మాట్లాడుతూ గ్రామంలో గుడిసెలేని గ్రామంగా తీర్చిదియడమే తమ లక్ష్యం అని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్క నిరుపేద కుటుంబీకులకు గృహాలు మంజూరు చేయడం జరుగుతూని అన్నారు. గృహ నిర్మాణ శాఖ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. అంతకుముందు లబ్ధిదారులు వచ్చిన ప్రజాప్రతినిధులకు శాలువాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి -సాయ గౌడ్ , గ్రామ పెద్దలు హన్మండ్లు , ప్రదీప్ , బాబన్న, ఉప్లంచవార్ శంకర్ , జుక్కల్ గ్రామ యువకులు బొంపెల్లివార్ విజయ్ కుమార్, లక్ష్మీకాంత్ పటేల్, గైక్వాడ్ నర్సింగ్, నిఖిల్ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.



