Friday, April 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి 

ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి 

- Advertisement -

నవతెలంగాణ-బీర్కూర్ (నసురుల్లాబాద్)
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని బీర్కూర్ మండలం లోని బరంగెడ్గి గ్రామాల్లో గ్రామ సర్పంచ్ రెంజర్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ. దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రజాకర్ల నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడిన దొడ్డి కొమురయ్య సాహసాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం గ్రామ అధ్యక్షుడు లక్కపల్లి శ్రీనివాస్, వార్డు సభ్యులు లక్కపల్లి హన్మండ్లు, గైని సాయిలు, బాలేష్, దేశ్ ముఖ్ దేవానంద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -