అరెస్టు చేసిన
సిడ్నీ పోలీసులు
సిడ్నీ (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డెవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. డెవిడ్ వార్నర్ (39) లీగల్ పరిమితికి రెండింతల మోతాదు మద్యం సేవించినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం సిడ్నీలో పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా డెవిడ్ వార్నర్‌కు బ్రీత్ అనలైజర్ టెస్టు చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడపటంతో డెవిడ్ వార్నర్‌ను అరెస్టు చేసిన సిడ్నీ పోలీసులు.. మారోబా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఆడుతున్న డెవిడ్ వార్నర్.. లీగ్‌కు వారం రోజుల విరామం రావటంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనుమతితో ఆస్ట్రేలియాకు వచ్చాడు. కరాచీ కింగ్స్‌కు కెప్టెన్సీ వహిస్తున్న డెవిడ్ వార్నర్ లీగ్‌లో ఆ జట్టుకు హ్యాట్రిక్ విజయాలు అందించాడు. కరాచీ కింగ్స్ ఏప్రిల్ 9న తర్వాతి మ్యాచ్ ఆడనుండగా.. ఆ లోగా డెవిడ్ వార్నర్ పాకిస్తాన్ తిరిగి వెళ్లనున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లోనూ సిడ్నీ థండర్స్‌కు కెప్టెన్సీ వహించిన డెవిడ్ వార్నర్.. 86.6 సగటుతో పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ అభియోగంపై డెవిడ్ వార్నర్ మే 7న సిడ్నీ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. మే 3న పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫైనల్ షెడ్యూల్ చేశారు. దీంతో పీఎస్‌ఎల్ లీగ్ ముగిసే వరకు డెవిడ్ వార్నర్‌కు ఎటువంటి ఇబ్బంది ఉండబోదు. డెవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంపై స్పందించేందుకు కరాచీ కింగ్స్ ప్రాంఛైజీ నిరాకరించింది.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వార్నర్
- Advertisement -
- Advertisement -



