- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలో అమరావతిలోని జిల్లా మహిళా ఆసుపత్రిలో నవజాత శిశువుల అత్యవసర చికిత్సా విభాగంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. NICUలోని ఓ వెంటిలేటర్‌లో పేలుడు సంభవించడంతో ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనం కాగా, మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ఆ సమయంలో వార్డులో 39 మంది నవజాత శిశువులు ఉన్నారు. పొగ, మంటలు వ్యాపించడంతో సిబ్బంది వెంటనే స్పందించి ఆ వార్డులోని శిశువులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
- Advertisement -



