జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం
నవతెలంగాణ – వనపర్తి
జిల్లాలో మాతా శిశు మరణాలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ తన చాంబర్లో మాతా శిశు మరణాలపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతా శిశు మరణాలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గర్భిణీల్లో రక్తహీనత ఉన్న వారిని గుర్తించే వారికి ముందస్తుగా పోషకాహారం అందించి, ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని నర్సింగ్ హోమ్ ల ద్వారా రక్త హీనత ఉన్న గర్భిణీల సమాచారం తీసుకుని వారిపై ప్రత్యేక సాధించాలన్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, చట్ట విరుద్ధంగా ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి సూచించారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాసులు, ఇతర వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.



