- Advertisement -
పద్మవ్యూహం
రైతు భారతంలో
ప్రతిఒక్కరూ
అభిమన్యులే
లెక్కకుమించి
నిత్యం రాలుతున్న
వారెందరో
కక్షగట్టారు
చుట్టుముట్టారు
నిర్దయగా
నిరాయుధుడ్ని
వధిస్తున్నారు
నిజం చెప్తున్నా
నా చేతిలో ఇప్పుడు
భూమిలేదు
విత్తనం లేదు
విద్యుత్‌లేదు
మందు లేదు
మార్కెట్ లేదు
నా సేద్యం ఊపిరికి
ప్రతి సూర్యోదయం
నవోదయమే
కర్మవీరునికి
సిసలైన అర్థం నేనే
ఎటువైపు నుంచి
శత్రువుల దాడి
ఎలా వస్తుందో
తెలిపేది నీవుకాక
మాకెవరు?
కడదాకా
నీ బుద్ధిబలం
నీ భుజబలం
అంతా..
రైతు ఉద్యమమేగా
కర్షక మల్లయోధా
నీవెత్తిన ఎర్రజెండా
ఎప్పటికీ వదలం
(కామ్రేడ్ మల్లారెడ్డికి విప్లవాంజలి)
కె.శాంతారావు, 995975723
- Advertisement -



