Tuesday, August 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజాబ్‌ నోటిఫికేషన్లు నిల్‌ లిక్కర్‌‌ నోటిఫికేషన్లు ఫుల్‌

జాబ్‌ నోటిఫికేషన్లు నిల్‌ లిక్కర్‌‌ నోటిఫికేషన్లు ఫుల్‌

- Advertisement -

మాజీ మంత్రి హరీశ్‌‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు విమర్శించారు. రాష్ట్రంలో జాబ్‌ ‌నోటిఫికేషన్లు నిల్‌, లిక్కర్‌ ‌ నోటిఫికేషన్లు ఫుల్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 121 మద్యం బ్రాండ్ల నోటిఫికేషన్లు ఆఘమేఘాల మీద విడుదల చేయడం పట్ల ఆయన సోమవారం ఎక్స్‌ ‌ద్వారా స్పందించారు. యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని ఈ ప్రభుత్వానికి మద్యం వ్యాపారానికి మాత్రం ఇంత తొందర ఎందుకని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధా? అని అడిగారు. యువత డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే, ప్రభుత్వం మద్యం షాపులను పెంచి, బ్రాండ్లు పెంచి, డబ్బు వసూలు చేయాలని చూస్తోందని విమర్శించారు. సమయానికి యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేని ఈ చాత గాని సర్కారు మద్యం షాపులకు, బ్రాండ్లకు మాత్రం నోటిఫికేషన్ ఇస్తున్నదని తెలిపారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మోసమనీ, ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ మోసమని విమర్శించారు. రాజీవ్ యువ వికాసం వికసించక ముందే వాడి పోయిందని పేర్కొన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలకు అతీ గతి లేకుండా పోయిందని తెలిపారు. రేవంత్ పగ.. యువత దగ అన్నట్టుగా తయారైందని పేర్కొన్నారు.ఇదేనా రేవంత్ రెడ్డి చెప్పిన ప్రజా పాలన?అని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -