Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీ కేంద్రాలలో అక్రమాలకు తావు లేకుండా ఆరోగ్య లక్ష్మి కమిటీలు

అంగన్వాడీ కేంద్రాలలో అక్రమాలకు తావు లేకుండా ఆరోగ్య లక్ష్మి కమిటీలు

- Advertisement -

సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్

నవతెలంగాణ తుంగతుర్తి:
అంగన్వాడీ కేంద్రాలలో అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులకు పౌష్టికాహారం పారదర్శకంగా అందించేందుకే ప్రభుత్వం “ఆరోగ్య లక్ష్మి” కమిటీలను ఏర్పాటు చేసిందని మండల సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని సంగెం గ్రామంలో అంగన్వాడి కేంద్రాలకు ఆరోగ్య లక్ష్మి కమిటీలను ఏర్పాటు చేసి మాట్లాడారు.ఈ మేరకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోషకాహార లోపం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని అన్నారు.

ఈ ఆరోగ్య లక్ష్మి కమిటీలు సరుకుల నాణ్యత,భోజన పంపిణీ పర్యవేక్షణ,అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే బియ్యం, కందిపప్పు, బాలామృతం, నూనె, గుడ్ల నాణ్యతను తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అవినీతి లేకుండా లబ్ధిదారులకు మెరుగైన పోషకాహారం అందించేందుకే కమిటీల ఏర్పాటు అని అన్నారు. ఈ కమిటీలకు స్థానిక సర్పంచ్ కలకోట్ల మల్లేష్ చైర్మన్, కన్వీనర్ గా మొదటి సెంటర్ కు రాజేశ్వరి, రెండవ సెంటర్ కు సుభద్ర, సభ్యులుగా ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ, వార్డు మెంబర్లు, ఏఎన్ఎం, తదితరులను ఎన్నుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -