నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన నిరుపేద ఎండి గౌస్ భాషా కు జీవనోపాధి కొరకు డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్ గురువారం ఫాస్ట్ ఫుడ్ స్టాండ్ ను అందించారు. ఈ సందర్భంగా అశోక్ తండ్రి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా డిసిసి మాజీ సభ్యులు పైడాకుల కృష్ణమూర్తి ఫాస్ట్ ఫుడ్ స్టాండ్ ను గౌస్ పాషా కు బహుకరించి మాట్లాడారు.
ప్రజా సేవయే పరమావధిగా నా కుమారుడు అశోక్ నిరంతరం సేవలు చేయడం అభినందనీయం అని, ప్రజా సేవ చేయాలనే నా ఆలోచనను శిరసా వహిస్తూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ, ఆర్థిక భరోసా ఇస్తూ నా పేరును, కాంగ్రెస్ పార్టీ పేరును నిలబెడుతూ అశోక్ చేస్తున్న ప్రయాణం ఎందరికో ఆదర్శనీయం కావాలన్నారు. జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న ఎండి. గౌస్ పాషా కుటుంబానికి ఫాస్ట్ ఫుడ్ స్టాండ్ విరాళంగా ఇచ్చి, వారి కుటుంబానికి అండగా నిలబడిన అశోక్ జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళి, ఇలాగే పేద ప్రజలకు సహాయం అందిస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉండాలని ప్రజాసేవలో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కమిటి అధ్యక్షుడు వేల్పుగొండ ప్రకాశ్, గ్రామ సర్పంచ్ మేకల రాధ – సుదర్శన్, గుండెబోయిన నాగలక్ష్మి – అనిల్ యాదవ్, తేళ్ల హరిప్రసాద్, చిక్కుల వెంకటేష్, చాపల ఉమాదేవి, బోనగాని సారయ్య, గణపాక సుధాకర్, కాసర్ల రాంబాబు, కుడిమెల నాగరాజు, ఎండి.రఫీ తదితర నాయకులు పాల్గొన్నారు.



