Tuesday, August 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో

బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తు బిజెపి మద్నూర్ మండలం శాఖ, మండల బీజేవైఎం శాఖ, ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బిజెపి, బిజెవైఎం నాయకులతోపాటు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బిజెపి పార్టీ మద్నూర్ మండలాధ్యక్షుడు తెప్పవార్ తుకారాం, జనరల్ సెక్రెటరీ ప్రవీణ్, ప్రశాంత్, చిన్న ఎక్లారా గ్రామ సర్పంచ్ మాధవ్ రావు, నాయకులు హన్మండ్లు, లక్ష్మణ్ పటేల్, జ్ఞానేశ్వర్, నరేష్, శివకుమార్, కిసాన్ మోర్చా  కంచిన్వార్ యాదవ్, రమేష్ దేశాయ్, నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -