- Advertisement -
సర్పంచ్ అబ్బినేని లింగస్వామి
నవతెలంగాణ – మల్హర్ రావు
అంగన్ వాడి కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పోషకాహరం లబ్ధిదారులకు అందించాలని మండలంలోని ఇప్పలపల్లి సర్పంచ్ లింగస్వామి సూచించారు. గురువారం గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సర్పంచ్, ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ తో కలిసి తనిఖీ చేశారు. టీచర్, ఆయా సమయపాలన పాటిస్తున్నారా.. లేదాని అరా తీశారు. రోజువారీ రిజిస్టర్లు తనిఖీ చేశారు. చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీలు ప్రభుత్వం అందించే పోషకాహారాలను అందించాలని ఆదేశించారు. అనంతరం ఆరోగ్య లక్ష్మీ కమిటిపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు అక్కల మానస, టీచర్, ఆయా పాల్గొన్నారు.
- Advertisement -



