Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ గృహ నిర్మాణాలను పరీశీలించిన ఎంపీఓ

ఇందిరమ్మ గృహ నిర్మాణాలను పరీశీలించిన ఎంపీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని చిన్న గుల్లా, కంఠాలి జిపి గ్రామాలలో జుక్కల్ ఎంపీఓ రాము గురువారం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాలను, నర్సరీలను, వైకుంఠధామాలను, గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, పరిశుభ్రత పచ్చదనం పాటించాలని సంబంధిత జిపి కార్యదర్శులకు సూచించారు.

ఎండలు పెరిగిపోయినందువలన నర్సరీలు పెంచుతున్న మొక్కలకు నిత్యం రెండు పూటలు నీటిని అందించాలని ఆదేశించారు. వైకుంఠధామాల వద్ద ముళ్ల కంపలు, పిచ్చి చెట్లు లేకుండా తొలగించాలని, నీటి సౌకర్యం ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామాలలో సమయాన్నికూలంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలు అందించాలని సూచించారు. అదేవిధంగా ఇంటి పన్నులను 100% వసూలు చేయాలని కార్యదర్శులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చిన్నగుల్లా సర్పంచ్ జ్ఞానేశ్వర్ , కంఠాలి సర్పంచ్ నాగనాథ్, ఆయా గ్రామాల జిపి కార్యదర్శులు,  తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -