విక్రయించిన వ్యక్తి వద్ద నుంచి 40 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం
నవతెలంగాణ-బాల్కొండ
బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న 31 మందిపై కేసు నమోదు చేసినట్లు బాల్కొండ ఎస్ఐ శైలేందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వన్నెల్ బి వరద కాలువ పైన గంజాయి సేవిస్తున్నారనే సమాచారం మేరకు బాల్కొండ పోలీసులు అక్కడికి చేరుకుని, 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ గంజాయి విక్రయించడానికి వచ్చిన ఒక వ్యక్తిని కూడా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 40 గ్రాముల ఎండు గంజాయి చిన్నచిన్న జిప్ లాక్ కవర్లకి సంబంధించిన ప్యాకెట్లను, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. గంజాయి విక్రయించే వ్యక్తిని రిమాండ్ కు తరలించి, గంజాయి సేవించిన వ్యక్తులను డి అడిక్షన్ సెంటర్లకు పంపే దిశగా వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ శైలేందర్ పేర్కొన్నారు.
బాల్కొండ మండల కేంద్రంలో 13 మంది
మండల కేంద్రంలోని మల్లన్న గుట్ట దగ్గర గంజాయి తాగుతున్నరానే సమాచారం మేరకు బాల్కొండ పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ గంజాయి తాగుతున్న 13 మందిని పట్టుకున్నట్లు బాల్కొండ ఎస్ ఐ తెలిపారు. అనంతరం వారిని డి అడిక్షన్ సెంటర్లకు పంపే దిశగా వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శైలేందర్ పేర్కొన్నారు.



