- Advertisement -
- – ప్రమాదంలో ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ధ్వంసం
నవతెలంగాణ – మియాపూర్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మజీద్ బండ నుండి బొటానికల్ గార్డెన్ కొండాపూర్ కు వెళ్లే దారిలో సైబరాబాద్ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ను మారుతి సుజుకి బ్రీజా (టీఎస్ 07 జి ఇ 9596) కార్ వేగంగా ఢీకొట్టడంతో పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కారు ప్రమాద తీవ్రత చూస్తే కారులో ఉన్న వ్యక్తులకు తీవ్రంగా గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో లేదా నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందాని తెలియారాలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -



