భూగర్భగనుల శాఖ ఏడీ నివాసాల్లో ఏసీబీ సోదాలు

నవతెలంగాణ బోడుప్పల్: భూగర్భ జల వనరుల శాఖకు చెందిన మైనింగ్ ఏడీ జయరాజు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులుగురువారం ఉదయం దాడులు నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం జయరాజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మైనింగ్ ఏడీగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆయన ఆదాయానికిమించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. హైదరాబాద్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్, వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారులు బోడుప్పల్‌లోని జయరాజు నివాసంతో తనికీలు చేపట్టారు. మొత్తం12 ప్రాంతాల్లోఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇండ్లు,కార్యాలయాలు,ఆస్తులకు సంబంధించిన పత్రాలు,బ్యాంకు లావాదేవీలు తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండు కార్లు, లక్షన్నరనగదు, రెండుబుక్స్ , జనగాంజిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి, పిక్సుడ్ డిపాజిట్లు పోస్టల్ డిపాజిట్లులభ్యం అయ్యాయి. ఇంకాపూర్తి స్థాయిలో సోదాలు జరుగుతున్నాయి.




