Thursday, August 27, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రజాసేవలో డాక్టర్ చల్మారెడ్డి గారి సేవలు మరువలేనివి

ప్రజాసేవలో డాక్టర్ చల్మారెడ్డి గారి సేవలు మరువలేనివి

- Advertisement -

  • వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

నవతెలంగాణ వనపర్తి 

  వైద్య వృత్తిలో కొనసాగుతూ ప్రజలకు అందించిన సేవలతో డాక్టర్ చల్మారెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆయన మృతి వనపర్తి ప్రాంత ప్రజలకు, వైద్య రంగానికి తీరని లోటన్నారు. గురువారం ఉదయం వనపర్తిలోని డాక్టర్ చల్మారెడ్డి స్వగృహానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆయన చల్మారెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. డాక్టర్ చల్మారెడ్డి ఎంతో సేవా భావం కలిగిన వ్యక్తి అని, వైద్య వృత్తిని కేవలం ఉపాధిగా కాకుండా ప్రజాసేవకు ఒక మార్గంగా భావించేవారని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా తన విద్యార్థులు ఎవరైనా వైద్య సేవల కోసం తనను ఆశ్రయించినప్పుడు, వారి ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందించేవారని గుర్తుకు చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో అనుబంధం ఉన్నప్పటికీ, వైద్య సేవలు అందించే విషయంలో ఆయన ఎప్పుడూ కుల, మత, వర్గ భేదాలను చూడలేదని, ప్రతి ఒక్కరినీ సమానంగా భావించి వైద్యం అందించడం ఆయనకే చెల్లిందన్నారు. డాక్టర్ చల్మారెడ్డి మరణంతో వనపర్తి ప్రాంతం ఒక మంచి వైద్యుడిని, సేవా తత్పరుడైన వ్యక్తిని కోల్పోయిందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కదిరే రాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -