- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాలిటెక్నిక్ కాలేజీ వైపు బయలుదేరిన మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఆయనను హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అంతకుముందు టీఎన్జీవోలు నిర్వహించిన ధర్నాలో మాజీమంత్రి హరీశ్‌రావు పాల్గొని మద్దతు తెలిపారు. ఆ తరాత్వ పాలిటెక్నిక్ కాలేజీ వైపు బయలు దేరడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. హరీశ్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, బీఆర్‌ఆర్ శ్రేణులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
- Advertisement -



