Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeఎడిట్ పేజిరాక్షస రూపేణా

రాక్షస రూపేణా

- Advertisement -

కటిక చీకటైనా
తెల్లవారే వరకే
పచ్చి నరహంతకుడైనా
చచ్చేవరకే
కోట్లకు పడగెత్తిన
కార్పొరేటైనా
మట్టికాక మానడుగా
ఈ సత్యం తెలియకనే
నిరంకుశత్వ కండకావరం
ద్రవ్య దురాశాహంకారం
ద్వితల విషనాగు
చిమ్ముతున్న కాలకూటం
నిష్కల్మష ప్రేమాంకురాలు
నిత్యం పరుచుకుంటున్నాయి
పుడమంతా..
నీ కళ్ళకే కన్పించవు
నీకో మత ఛాందస తొడుగు
అధికార మదాంధకార గొడుగు
యుద్ధాలు వస్తున్నాయి
ఎవరి వల్ల?.. నీ వల్లే..
మాకు మాత్రం.. అది నరమేథే
నీవో మారణాయుధాల
మర మనిషివి
దోషి ఎవరో నీవే నిర్ణయించి
ప్రాణాలు తీస్తున్నావ్‌
రక్తం తాగుతూ
నీతులు చెప్తున్నావ్‌
అమానుష ధర్మం
రాక్షస రూపేణా
– కె.శాంతారావు, 9959745723.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad