– తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైద్య ఆరోగ్యశాఖలో గాంధీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న రోజా రాణి మరణం ఉద్యోగ, కార్మిక వర్గానికి తీవ్రమైన లోటని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె యాదానాయక్ మంగళవారం ఒక ప్రకటనలో సంతాపాన్ని ప్రకటించారు. వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్ నర్స్ గా ( నర్సింగ్ ఆఫీసర్ ) ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్న క్రమంలో తన దృష్టికి వచ్చిన అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని, ఉద్యోగులకు, కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ అనుబంధంగా యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ స్థాపించడంలో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అందులో భాగంగా 1997లో ఉమ్మడి రాష్ట్రంలో ఆవిర్భవించిన యూనియన్‌కు మొదటి ట్రెజరర్‌గా పని చేశారనీ, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అనేక కేడర్ల కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం జరిగిన రాజీలేని పోరాటాల్లో చురుకైన పాత్రను పోషిచారని తెలిపారు. ఈ సందర్భంగా సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రోజా మరణం ఉద్యమానికి నష్టం :తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సంతాపం
రోజా రాణి మరణం కార్మికోధ్యమానికి తీవ్ర నష్టమని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రైటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 1997 లో వైద్య ఆరోగ్య శాఖలో సీఐటీయూ అనుబంధంగా ట్రేడ్ యూనియన్ ఏర్పాటులో క్రీయాశీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రధమ రాష్ట్ర మహాసభలు ఖమ్మం జిల్లాలో జరిగినప్పుడు రోజారాణి ట్రెజరర్‌గా ఎన్నికైందని తెలిపారు. సంఘాన్ని హైదరాబాద్‌లో నిర్మించేందుకు కృషి చేసిందని తెలిపారు. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగిఉండే తత్వం అని తెలిపారు. రోజా మరణం వైద్య ఆరోగ్య సంఘానికి వారి కుటుంబానికి మాత్రమే కాక, సీపీఐ(ఎం), ఇతర సంఘాలకు తీరని లోటని పేర్కొన్నారు.
రోజారాణి మరణం ఉద్యోగ, కార్మిక వర్గానికి తీరని లోటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



