- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జూన్ 4 వరకూ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. జూన్ 3న నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. జూన్ 4న కుమురం భీమ్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లె, ములుగు మినహా మిగతా జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని.. హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు, ఈదురుగాలులు ఉండొచ్చని తెలిపింది.
- Advertisement -