నవతెలంగాణ – హైదరాబాద్ : ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ సమయంలో డ్రోన్ అత్యంత సమీపంలోకి వచ్చింది. కొద్దిలో ఢీకొనే ప్రమాదం తప్పిందని నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్ వెల్లడించారు. మాల్డోవా నుంచి నార్వే రాజధాని ఓస్లోకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నార్వే రాజు హెరాల్డ్-5 అంత్యక్రియలకు హాజరయ్యేందుకు జెలెన్స్కీ ప్రయాణించారు. డ్రోన్ ఘటనతో మాల్డోవా గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడంతో ఆయన విమానం కొంత ఆలస్యమైంది. అనంతరం గగనతల ఆంక్షలు ఎత్తివేయడంతో విమానం ఓస్లోకు బయలుదేరింది. డ్రోన్ ఎటువైపు నుంచి వచ్చిందనే వివరాలను నార్వే ప్రధాని వెల్లడించలేదు. మాల్డోవా అధికారులు మాత్రం తమ గగనతలంలోకి రెండు రష్యా డ్రోన్లు ప్రవేశించాయని, వాటిలో ఒకటి రిస్కానీ జిల్లాలోని పొలంలో కూలిపోయిందని తెలిపారు.
జెలెన్స్కీ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



