నవతెలంగాణ – హైదరాబాద్: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘80s’ ఫొటో ట్రెండ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరారు. ఏఐ సాయంతో 80ల నాటి యువకుడిగా తనను తాను ఊహించుకుంటూ రూపొందించిన ఫొటోను ఆయన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫొటోలో రేవంత్ రెడ్డి డాషింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. 80ల నాటి యువతకు ఐకానిక్‌గా నిలిచిన యమహా ఆర్‌ఎక్స్ 100 బైక్ పక్కన స్టైలిష్‌గా నిల్చున్నారు. పక్కనే వింటేజ్ రేడియోను ఉంచడంతోపాటు హెయిర్‌స్టైల్, దుస్తులు, బ్యాక్‌గ్రౌండ్ సైతం 80ల కాలాన్ని గుర్తుచేసేలా రూపొందించారు.
‘తాను కూడా 80s ట్రెండ్‌లో జాయిన్ అయ్యానని’ రేవంత్ రెడ్డి క్యాప్షన్ ఇచ్చారు. పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఫొటో వైరల్‌గా మారింది. నెటిజన్లు, అభిమానులు ఆసక్తికరంగా స్పందిస్తూ ‘అన్నా.. సూపర్’, ‘టాలీవుడ్ ఓ మంచి హీరోను మిస్ అయింది’, ‘డాషింగ్ లుక్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పలువురు ఏఐ సాయంతో 80ల నాటి ఫొటోలను రూపొందించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ ట్రెండ్‌లో రాజకీయ నాయకులు కూడా భాగం కావడం ఆసక్తికరంగా మారింది.



