- Advertisement -
నవతెలంగాణ-నవాబుపేట
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో భాగంగా మండలంలోని కారుకొండ గ్రామంతో పాటు వివిధ గ్రామాల్లో జరుగుతున్న సర్ సర్వే ఫేజ్ 2ను ఎంపీడీవో జయరాం నాయక్, ఎంపీఓ బద్రు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఓటర్ విధిగా తమ పేర్లను సరిచూసుకోవాలని సూచించారు. బీఎల్ఓలకు ఓటర్లు సహకరించాలని కోరారు. ఓటర్లు తమ సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తప్పులను సరిదిద్దుకున్నప్పుడే ఓటర్ల పేర్లు జాబితాలో ఉంటాయని, అందుకు బీఎల్ఏ లు సహాకరించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు భూపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, బీఎల్ఓ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



