కౌన్సెలింగ్ ల ద్వారా ఆత్మహత్యలు నివారించవచ్చు: సీనియర్ వైద్యులు డాక్టర్ రామకృష్ణ
నవతెలంగాణ-అచ్చంపేట
నేటి సమాజంలో మనిషి జీవితం గడియారం ముళ్ళుతో పోటీపడి ప్రయాణిస్తోంది. చిన్నచిన్న సమస్యలతో విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సినియర్ వైద్యులు డాక్టర్ రామకృష్ణ అన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన నవతెలంగాణతో మాట్లాడారు. జీవితంలో వచ్చే కష్టాలు, ఓటములు, తాత్కాలికం మాత్రమే.. కానీ మన ప్రాణం చాలా విలువైనది. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందనీ, సమస్యలను ఇతరులతో పంచుకొని మనసును కుదుట పరుచుకోవచ్చునని సూచించారు.
ఆత్మహత్య అనేది ఒక కారణంతోనే సంభవించదు. కుంగుపాటు, మద్యం మాదక ద్రవ్యాలకు బానిస కావడం, అప్పులు, కుటుంబ సమస్యలు, నిరుద్యోగం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, హింస, వేధింపులు ఒంటరితనం, సమాజంలో హేళనకు గురికావడం, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తాయన్నారు. సమస్యలను ఇతరులతో చర్చించుకోవడం వలన, కౌన్సెలింగ్ ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు పై లక్షణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు గమనించి కౌన్సిలింగ్ ఇప్పించాలని తెలిపారు. మనసులోని బాధను నమ్మకమైన స్నేహితులతో, కుటుంబ సభ్యులతోనూ, భావాలను పంచుకోవాలని చెప్పారు.
మానసిక సమస్యలు శాస్త్ర సమస్యలు కాబట్టి సంకోచించకుండా సైకియాట్రిస్ట్ సంప్రదించాలన్నారు. అదేవిధంగా ప్రతిరోజు తగినంత నిద్ర, పౌస్టికాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. అలాంటి లక్షణలు ఉన్న వారు చెపుతున్న బాధలను ఓపికగా వినాలనీ, ఎగతాళీ చేయోద్దనీ, ఆదరణ చూపించి, జీవితంపై నమ్మకం కలిగించాన్నారు. ఆత్మహత్య అనేది ఒక తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య అనీ, దీనిని సరైన సమయంలో సహాయం అందించడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చని సూచించారు.



