నవతెలంగాణ – కమ్మర్ పల్లి
వృద్ధులు, అనాధల పిల్లలకు చేయూతను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని గోసంగి కమ్యూనిటీ జిల్లా అధ్యక్షులు, దళితరత్న, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత ఈర్నాల వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో పలువురు వృద్ధులు, అనాధలకు నిత్యవసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. గ్రామంలో వృద్దులు, అనాధ పిల్లలు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
వృద్ధులను మంచి వృద్ధాశ్రమంలో చేర్పించి వారికి మూడు పూటల మంచి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.అనాధ పిల్లలను, అనాధాశ్రమంలో చేర్పించి వారికి దుస్తువులు, భోజనం, మంచి చదువు నేర్పించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. కమ్మర్ పల్లి గ్రామస్తులు మీ దృష్టికి ఎవరైనా వస్తే ఫోన్ నెంబర్ 9666229809 సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోసంగి సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



