Friday, September 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చోరీకి గురైన ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌లోని ఓ విశ్రాంత ఆర్మీ అధికారి నివాసంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ కేసులో ఓ అధికారితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయుధాల చోరీలో ఇద్దరు ఇన్‌ఛార్జిల సహకారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బొల్లారం, మల్కాజిగిరి పోలీసులు, ఎన్‌ఐఏ, ఆర్మీ ఇంటెలిజెన్స్‌ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలో పోలీసులు, ఆర్మీ అధికారులు మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -