Saturday, September 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందించాలి

రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందించాలి

- Advertisement -

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటు ఇస్తామని గొప్పలు చెప్పి కనీసం 10 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు సూద్దాల చంద్రయ్య, అయిలేని మల్లికార్జున రెడ్డి ఆరోపించారు. శనివారం హుస్నాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చామని, మాజీ సీఎం కెసిఆర్  రైతుల కోసం అనేక పథకాలు చేపట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రైతులకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. 

కరెంట్ సరఫరాలో నాణ్యమైన కరెంట్ ఇవ్వక పోవడంతో మోటార్లు, ట్రాన్స్ఫర్స్ కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సరిపడా విద్యుత్‌ ను అందించాలనీ రైతులు రోడ్లు ఎక్కి పోరాటం చేయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతుంగాన్ని ఇబ్బందులు గురి చేస్తే బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన నిలపడి పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిత్తరి శ్రీనివాస్, మేకల వికాస్ యాదవ్ ,యాస శ్రీనివాస్,  ఇంద్రాల సారయ్య, ఇరుగు రమేష్ ,గుగులోతు తిరుపతి నాయక్ ,పెట్టుగడి కనుక రాజు , సమ్మయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -