- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఆదివారం, సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా పయనించి విదర్భ వద్ద బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు వర్షాలు, ఉరుములు, 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
- Advertisement -



