- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా ఉప్పల్ భగాయత్‌లో ఆదివారం ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మాజీ సీఎం రోశయ్య దూరదృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందని కొనియాడారు. హైదరాబాద్‌లో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పేద ఆర్యవైశ్యులకు కూడా ఈ భవనం ఉపయోగపడాలని ఆకాంక్షించారు. భవన నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామన్న సీఎం.. ఆర్యవైశ్యులు ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వారని పొగిడారు. అంతా కలిసికట్టుగా ఉండి రాజకీయాల్లో తమ వాటాను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
- Advertisement -



