Friday, April 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏహెచ్‌సీపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయండి

ఏహెచ్‌సీపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయండి

- Advertisement -

– డీఎంఈకి జాయింట్‌ ఫోరం విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో పూర్తి స్థాయి ఏహెచ్‌సీపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ అలైడ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌ జాయింట్‌ ఫోరమ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గురువారం హైదారాబాద్‌లోని డీఎంఈ కార్యాలయంలో డైరెక్టర్‌ డాక్టర్‌ నాగరాజు, టీజీపీఎంబీ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌తో సంఘం సభ్యులు సమావేశమై చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే స్టేట్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేశారనీ, తెలంగాణలో మాత్రం ఇంకా ప్రక్రియ మొదలు పెట్టలేదని జాయింట్‌ ఫోరం డీఎంఈ దృష్టికి తీసుకురాగా, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీహెచ్‌పీఏ జాతీయ అధ్యక్షులు శిరందాస్‌ శ్రీనివాసులు, జాయింట్‌ ఫోరమ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిందర్‌ మంచాల, స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ నాగరాజు, ఏహెచ్‌సీపీ మాజీ చైర్మెన్‌ కె.విజరు కుమార్‌, జాయింట్‌ ఫోరమ్‌ రాష్ట్ర అధ్యక్షులు దామోదర నాయుడు, బయోకెమిస్ట్‌ పి.విజయేందర్‌ ఎంఆర్‌ఐ స్పెషలిస్ట్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -