Wednesday, September 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయెమెన్‌లో విద్యకు దూరమవుతున్న చిన్నారులు

యెమెన్‌లో విద్యకు దూరమవుతున్న చిన్నారులు

- Advertisement -

న్యూయార్క్‌ : ప్రస్తుతం కొనసాగుతున్న తాజా ఘర్షణల కారణంగా యెమెన్‌లో 1,37,000 మందికి పైగా చిన్నారుల విద్యాభ్యాసానికి ఆటంకం ఏర్పడుతోందని యునిసెఫ్‌ తెలిపింది. బాధిత పిల్లల కోసం తమ బృందాలు 20 తాత్కాలిక తరగతి గదులను ఏర్పాటు చేశాయని, వారి రక్షణ కోసం చర్యలు చేపట్టామని చెప్పింది. ఘర్షణల కారణంగా చిన్నారులు తమ భవిష్యత్తును కోల్పోకూడదని పేర్కొంది. పశ్చిమ తెయిజ్‌ రాష్ట్రానికి, యెమెన్‌ పశ్చిమ తీరం వెంట ఉన్న జిల్లాలకు చెందిన అనేక కుటుంబాలు తమ ఆవాసాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నాయని వివరించింది. తాజా ఘర్షణల కారణంగా నిరాశ్రయులైన 14,000 మందికి యునిసెఫ్‌, ఐరాస జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) సంయుక్తంగా అత్యవసర సాయాన్ని అందిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -