చెరువులో పడి ఆరుగురు విద్యార్థులు మృతి
నవతెంలంగాణ/పటాన్‌చెరు
సంగారెడ్డిజిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామంలోని వినాయక విగ్రహం నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్లిన వారిలో ఆరుగురు ప్రమాదవశాత్తూ నేరేడు చెరువులో పడిపోయారు. వెంటనే స్పందించిన
గ్రామస్థులు.. గల్లంతైన వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతులను నరసింహ(21), తేజ(17), సిద్దార్థ(17), గణేశ్ (18), సుమంత్‌రెడ్డి (17), ఉదయ్ కిరణ్ (22)గా గుర్తించారు.
ఘటనపై మంత్రి పొన్నం తీవ్ర దిగ్భ్రాంతి
గణేశ్ నిమజ్జనం సందర్భంగా శిరీష ఛారిటబుల్ ట్రస్టుకు చెందిన ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతి తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, ఘటనకు సంబంధించిన పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు నీటిలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల్లో ప్రమాదకరమైన, లోతైన ప్రాంతాలను గుర్తించి ప్రజలు అక్కడికి వెళ్లకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. గజ ఈతగాళ్లు, రక్షణ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



