Thursday, September 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం 

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం 

- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, రాతిరం తండా గ్రామం మాజీ సర్పంచ్, గుగులోతు బిక్కు నాయక్ 
నవతెలంగాణ-నెల్లికుదురు

మండలంలోని రత్తిరామ్ తండా గ్రామంలో గురువారం తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించినట్లు ఆ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గుగులోతు బిక్కు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసీఆర్ హాయంలో ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10%కి పెంచిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 3146 తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. తండా గిరిజనల హక్కుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయానికి కట్టుబడి ఉండి గిరిజన అభివృద్ధి కోసం కృషిచేసింది కెసిఆర్ మాత్రమే అని తెలిపారు. గిరిజనులు అభివృద్ధి కోసం కృషిచేసి గొప్ప మానవత్వాన్ని చాటుకున్న కేసీఆర్ కు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తండావాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ మాజీ ఉపసర్పంచ్  సెట్రం, బాలాజీ, దాసు, రాజేందర్, శ్రీను, రత్తిరామ్, వెంకన్న, శక్రు, సంతోష్, దేవేందర్, వెంకన్న, నెహ్రు, లచ్చిరామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -