కరపత్రం ఆవిష్కరణ
నవతెలంగాణ-నెల్లికుదురు
చలో యాదగిరిగుట్ట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని శుక్రవారం ఆ సంఘం మండల అధ్యక్షుడు కుమ్మరి కోట్ల మౌనేందర్ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు విరగని మల్లేశం గౌడ్ జిల్లా సంయుక్త కార్యదర్శి పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్ హాజరై మాట్లాడుతూ.. ఈనెల 27న యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్, బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ లలో నిర్వహించబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన తెలంగాణ మలి దశ ఉద్యమకారులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధగాని ఉపేందర్, గొడుగు రామకృష్ణ, బొమ్మ రాతి నాగన్నతో పాటు కొంతమంది పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల ఆవిర్భావ వేడుకను విజయవంతం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



