నవతెలంగాణ-హైదరాబాద్: మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నందిగ్రామ్ ఉప ఎన్నికల బరి నుంచి ఆమె అభ్యర్థి తప్పుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌లోని తన వర్గానికి పార్టీ చిహ్నం, లోగో కేటాయించబడని మరుసటి రోజే పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తృణమూల్ కాంగ్రెస్‌లోని ప్రత్యర్థి వర్గాలకు ఎన్నికల సంఘం శుక్రవారం వేర్వేరు ఎన్నికల చిహ్నాలను కేటాయించింది. అరూప్ రాయ్ నేతృత్వంలోని వర్గానికి ‘డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరు, ‘ఎన్వలప్’ గుర్తును కేటాయించగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరు, ‘ఫుట్‌బాల్ ప్లేయర్’ గుర్తును కేటాయించారు. దీంతో మమతా బెనర్జీ , అరూప్ రాయ్ నేతృత్వంలోని వర్గాలు కొత్త గుర్తింపులతో బైపోల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.
మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



