Saturday, September 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహాయిగా నవ్వుకునే సినిమా

హాయిగా నవ్వుకునే సినిమా

- Advertisement -

గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు నిర్మిస్తున్న సినిమా ‘మగాళ్లు జిందాబాద్‌’. శ్రీ నందు, వెన్నెల కిషోర్, వైవా హర్ష ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ సినిమాకి నార ప్రవీణ్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ ఘనంగా జరిగింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి శిష్యుడిగా నారా ప్రవీణ్ సినిమా టైటిల్ తోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు. డైరెక్టర్ నార ప్రవీణ్ మాట్లాడుతూ, ‘ఇదొక సెటైరికల్ కామెడీ ఫిల్మ్‌. అందుకోసమే ‘మగాళ్లు జిందా బాద్’ అనే టైటిల్ పెట్టాం. సొసైటీలో ఆడవారికి దక్కే కంఫర్ట్ గాని, న్యాయం కానీ, సింపతీ కానీ మగాడికి దక్కట్లేదు అనే టాపిక్ ను సెటైరికల్ టోన్ లో, డీల్ చేస్తూ ఔట్ అండ్ ఔట్ కామెడీ జెనరేట్ చేశాం. ఇది ఒక సోషల్ సెటైరికల్ మూవీ. దీని మీదే ఈ సినిమా చాలా ఆహ్లాద కరమైన కామెడీతో సాగుతుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమా అందరికీ నచ్చు తుంది. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు’ అని హీరోయిన్ లక్ష్మీ దుర్గ చెప్పారు. హీరో శ్రీ నందు మాట్లాడుతూ,‘ఈ టైటిల్ చాలా మందిలో ఆలోచనలను రేకెత్తి స్తుంది. మరికొందరికి నవ్వు తెప్పి స్తుంది. ఆడవాళ్లను డామినేట్ చేయడానికి ఈ టైటిల్ పెట్టలేదు. మగవాళ్ళ భావాలు, బాధలు, కష్టాలు చెప్పుకోవడానికి చాలా మంది ఆలోచిస్తారు. అలాంటి వారి కోసమే ఈ టైటిల్. అంతేకానీ ఆడవాళ్లను తక్కువ చేయడం కాదు, ఆడవాళ్లు ఎప్పుడూ గ్రేట్. అందుకే ఆడవాళ్లు జోహార్ అని అన్నారు. నిజ జీవి తంలో మగవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను సినిమాలో వినోద భరితంగా చూపించడం కోసమే ఈ సినిమా. ఆరేళ్ల నుంచి 60 ఏళ్ల వరకు కుటుంబ సమేతంగా హాయిగా నవ్వుకునే సినిమా’ అని అన్నారు. ‘హీరో శ్రీ నందుకు ఇప్పటివరకు సరైన కంటెంట్ పడలేదు. ఈ చిత్రం ఆయనకు కమర్షియల్ గా మంచి మైలేజ్ తీసుకొస్తుంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష, శ్రీ నందు పోటాపోటీగా నటించి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు’ అని నిర్మాత ప్రసాద్ భాస్కర్ల చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -