Sunday, September 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయండెన్మార్క్‌తో ట్రంప్‌ ఒప్పందం

డెన్మార్క్‌తో ట్రంప్‌ ఒప్పందం

- Advertisement -

గ్రీన్‌‌లాండ్‌‌లో అమెరికా సైన్యాన్ని మోహరించేందుకు మార్గం సుగమం
​ఒప్పందంపై వచ్చే వారం సంతకాలు
ఇందుకు పార్లమెంట్ ఆమోదం కూడా అవసరం : డెన్మార్క్‌ ప్రధాని మెట్టె ‌ఫ్రెడెరిక్సన్‌ ‌కార్యాలయం

వాషింగ్టన్ : నాటో మిత్రదేశమైన డెన్మార్క్ నుంచి గ్రీన్‌‌లాండ్‌ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుం టామని పదేపదే బెదిరించిన ట్రంప్, తాజాగా ఆ దేశంతో డీల్ కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. ఆ ద్వీపం డెన్మార్క్ చేతుల్లోనే ఉంటుంది. కానీ అక్కడ అమెరికా సైన్యాన్ని మరింతగా మోహ రించేందుకు అవకాశం లభించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ‌ట్రంప్ శనివారం తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు.‘‘ ఈ ఒప్పందం ద్వారా గ్రీన్‌‌లాండ్‌ ‌భద్రత, ఇతర అంశాలపై అమెరికాకు శాశ్వత నియంత్రణ లభిస్తుంది. దీంతో అమెరికాకు ఉన్న అనేక ఆందో ళనలకు పరిష్కారం లభించింది. ఈ ఒప్పందంతో, ఖనిజ సంపద అధికంగా ఉన్న డెన్మార్క్ భూభాగంలో, యూఎస్ సైన్యాన్ని మోహరించే పనిని వెంటనే ప్రారంభిస్తాం” అని ట్రంప్ పేర్కొన్నారు.వచ్చే వారమే సంతకాలు :
డెన్మార్క్‌ ‌ప్రధాని కార్యాలయంఅయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనను డెన్మార్క్ కూడా ధ్రువీకరించింది. వచ్చే వారం ఐక్య రాజ్యసమితి సర్వసభ్య సమా వేశంలో ఈ ఒప్పందంపై మూడు దేశాల ప్రభుత్వాలు సంతకం చేస్తాయని డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్ కార్యాలయం తెలిపింది. అయితే దీని అమలుకు డెన్మార్క్, గ్రీన్‌‌లాండ్‌ ప్రభుత్వాల పార్లమెంట్ల ఆమోదం కచ్చితంగా అవసరమని తేల్చిచెప్పింది. ఈ ఒప్పందం గ్రీ‌న్‌‌లాండ్‌, డెన్మార్క్‌ ‌ల సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను నిర్థారిస్తుందని, అలాగే ఇరుదేశాల ప్రజల స్వీయ నిర్ణయాధికారాన్ని గౌరవిస్తుందని డెన్మార్క్ ప్రధాని తెలిపారు. మరోవైపు ఈ ఒప్పందంపై గ్రీన్ ల్యాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ కూడా స్పందిం చారు.‘‘ఈ డీల్ అమెరికా, డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌ మూడింటికీ ప్రయో జనకరం. ఇది గ్రీన్ల్యాండ్ ప్రయో జనాలకు, అంతర్జాతీయ సహకారంలో మా స్థానాన్ని గుర్తింస్తుంది’’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -