- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో విద్యార్థులకు దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు 13 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ సెలవులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వర్తిస్తాయి. సెలవులకు ముందు అక్టోబర్ 1 నుంచి 9 వరకు విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (SA) పరీక్షలు నిర్వహించనున్నారు.
- Advertisement -



